రాసలీలల స్వామీజీగా పోసాని క్రిష్ణమురళి


 http://www.aksharanews.com/180310news01-t.html

సాధారణంగా ఏ పీరియడ్ లో అయినా స్వామీజీలకు ఉన్నంత క్రేజ్  మరెవ్వరికీ ఉండదు. ఇటీవలి కాలంలో ఆ క్రేజ్ మరీ పెరిగిపోయింది. ఫలానా స్వామీజీ... ఫలానా హీరోయిన్తో రాసలీలలు సాగించారని తెలియగానే యూట్యూబ్ లో సదరు ద్రుశ్యాలను తిలకించి తరించడానికి కొన్ని రోజుల వ్యవధిలోనే ఎన్ని లక్షల మంది ఎగబడ్డారో మనకు తెలియని విషయం ఏమీ కాదు.  నిజంగానే కొన్ని లక్షల మంది చూడడానికి ఎగబఃడేంత క్రేజ్ ఉన్నప్పుడు... ఆ ‘‘ఎలిమెంట్’ను క్యాష్ చేసుకోవాలనే ఎవ్వరైనా అనుకుంటారు కదా. అలాగే  ఇప్పుడు  సదరు స్వామీజీల రాసలీలలకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి కూడా ఒక నిర్మాత సిద్ధం అవుతున్నారు.
వెండితెరమీద ఇలాంటి వక్రపాత్రలు పోషించడానికి సదా సిద్ధంగా ఉండే హీరో కమ్ డైరక్టర్ పోసాని క్రిష్ణమురళి ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండడం విశేషం.
సినిమా పోస్టర్ ఎలా ఉంటుందంటే...
‘‘తల చుట్టూ తలపాగా చుట్టుకుని... పెద్ద బొట్టు, నున్నటి షేవింగ్తో... బాబ్డ్ హెయిర్ ను భుజాల మీదుగా వదిలేసి ఉన్న స్వాముల వారు...  అర్థ నిమీలిత నేత్రాలతో అభయహస్తం చూపిస్తూ అనుగ్రహిస్తూ ఉంటారు.  స్వాముల వారికి ఇరువైపులా ఆయన శిష్య పరమాణువులు బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ లు కొలువు దీరి ఎదురుగా ఉన్న భక్తురాండ్రను అలా  తినేసేలా చూస్తూ ఉంటారు. స్వాముల వారికి ఎదురుగా కూర్చుని ఉన్న నలుగురు భక్తురాండ్రుగా షకీలా,. ముమైత్ ఖాన్, భువనేశ్వరి, జ్యోతి తమ తమ క్లీవేజీలను ప్రదర్శిస్తూ స్వామికి ప్రణమిల్లుతూ ఉంటారు.’
ఇదీ భంగిమ.
అయితే స్వామీజీకి కాషాయ వస్త్రాలు ధరింపజేయాలా... లేదా, శ్వేత వస్త్రాంబరధారిగా చూపించాలా అనే విషయంలో నిర్మాతలు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఈ చిత్రం ద్వారా ఒక నూతన దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఒక ఫైనాన్షియర్ నిర్మాతగా ఈ చిత్రం తయారు కాబోతోంది.
వెంటనే పూర్తిచేసేయాలని...
ఇలాంటి పోస్టరు డిజైను చేసుకుని నిర్మాతలు ఈ చిత్రం ద్వారా ఏం ఎస్టాబ్లిష్ చేయదలచుకున్నారో ప్రత్యేకంగా వేరే చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు కదా. పోసాని క్రిష్ణమురళి అంటేనే ఆయన స్టయిల్... విషయాలను నిర్మొగమాటంగా, ఇంకాస్త ఘాటుగా చెప్పాలంటే నిస్సిగ్గుగా చెప్పడంలో ఆయనకు ఉండే తెగువ అందరికీ తెలిసినవే. అందుకనే ప్రత్యేకంగా పోసానిని ఎంపిక చేసుకుని మరీ ఈ చిత్రం చేస్తున్నారు. స్వతహాగా తాను రచయిత, దర్శకుడు కూడా అయినప్పటికీ ఈ చిత్రంలో మాత్రం కేవలం స్వామీజీగా నటన వరకే పరిమితం అవుతున్నాడంటే... పోసాని ఇలాంటి దొంగస్వాముల మీద తీసే సెటైర్ చిత్రానికి ఎంతగా నప్పుతారని నిర్మాతలు భావించారో మనకు అర్థం అవుతుంది.  ప్రేక్షకుల మార్కెట్ లో నిత్యానంద స్వామికి ఉన్న క్రేజ్ పలుచన అయిపోక ముందే ఈ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేసేయాలని అనుకుంటున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన ప్రనకటన రెండు మూడు రోజుల్లో వెలువడుతుంది. మూడు వారాల్లో షూటింగ్ ముగించి నెలలోగా విడుదల చేసేయాలని శరవేగంగా స్క్రిప్టు పనులు పూర్తి చేస్తున్నారు.

Comments